పెరిగిన రైల్వే టికెట్ ఛార్జీలు.. ఎంతో తెలుసా.?
By అంజి Published on 1 Jan 2020 9:26 AM ISTహైదరాబాద్: రైల్వే టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌కు కిలోమీటరకు ఒక పైసా చొప్పున పెంచాలని నిర్ణయించింది. మెల్ ఫస్ట్‌క్లాస్, స్లీపర్ క్లాస్‌కు 2 పైసల చొప్పున పెంచింది. ఏసీ టూటయర్, త్రిటయర్, ఏసీ ఫస్ట్‌క్లాస్, ఏసీ చైర్‌కారుకు కిలోమీటరుకు 4 పైసలు పెంచారు. పెంచిన చార్జీలు నేటి అర్థరాత్రి నుంచి అమలులో వచ్చాయి. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు రైల్వే శాఖ ఊరటనిచ్చింది. సబర్మన్, ఎంఎంటీఎస్ రైలు ఛార్జీలను రైల్వేశాఖ పెంచలేదు. 2014లో చివరిసారిగా రైల్వేటికెట్ చార్జ్‌లను పెంచారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది.
Next Story