కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, స్మృతి మందానలకు నాడా నోటీసులు
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2020 12:23 PM ISTభారత క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(నాడా) నోటీసులు ఇచ్చింది. లాక్‌డౌన్ సమయంలో తాము ఎక్కడ ఉన్నాడో చెప్పక పోవడంతో కేఎల్ రాహుల్, ఛతేశ్వర పుజార, రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలకు నాడా నోటీసులు జారీ చేసింది.
కాగా.. ఈ నోటీసులపై ఆటగాళ్ల తరుపున బీసీసీఐ వివరణ ఇచ్చింది. సంబంధిత దరఖాస్తు ఫారానికి సంబంధించిన వెబ్‌సైట్ పాస్‌వర్డ్‌లో సమస్య కారణంగానే వారి వివరాలు పంపడంలో ఆలస్యం అయ్యిందని తెలిపింది. దీనిపై నాడా స్పందించింది. బీసీసీఐ వివరణ న్యాయ బద్ధంగానే ఉందని, ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ ఛైర్మన్ డైరెక్టర్ జనవరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. లాక్‌డౌన్ అమలైన సుమారు మూడు నెలల కాలంలో జాతీయ క్రీడాకారులు తాము ఎక్కడ ఉంటున్నామనే విషయాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని నాడా తెలిపింది.
సాధారణంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్లు తాము ఏ ప్రాంతంలో ఉన్నామో రెగ్యులర్‌గా నాడాకి చెందిన సాప్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేస్తుంటారు. కొన్ని సార్లు క్రికెటర్లకి తీరిక లేకపోతే.. బీసీసీఐ ఆ బాధ్యత తీసుకుని ఆటగాళ్లకి బదులుగా వారి సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుంటుంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్లపై బీసీసీఐ ఎప్పుడూ నిఘా ఉంచే ఉంటుంది. అలానే నాడా కూడా ఆటగాళ్ల నుంచి రెగ్యులర్‌గా సమాచారం సేకరిస్తూ ఉంటుంది. మ్యాచ్ ఫిక్సింగ్, బుకీల సంప్రదింపుల్ని కట్టడి చేసేందుకు క్రికెట్ బోర్డులు ఇలా నిఘా వేస్తుంటాయి.