స్టేజిపై స్టెప్పులేసిన 'రాహుల్‌ గాంధీ'

By సుభాష్  Published on  27 Dec 2019 9:38 AM GMT
స్టేజిపై స్టెప్పులేసిన రాహుల్‌ గాంధీ

ఛత్తీ గడ్‌ లోరాహుల్ గాంధీ స్టేప్పులేశారు. జాతీయ ఆదివాసీ నృత్య వేడుకలు ప్రారంభమయ్యాయి. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలకు రాహుల్‌గాంధీతోపాటు, ఛత్తీస్‌ గఢ్‌ సీఎం భూపేశ్‌ బగేల్‌, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ రాహుల్‌ గాంధీ డోల్‌ వాయిస్తూ స్టేజిపై స్టెప్పలేశారు.గిరిజనులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఈ వేడుకలకు 25 రాష్ట్రాల్లోని ఆదివాసీలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 1200 మంది గిరిజన నృత్యకళాకారులు పాల్గొన్నారు.

అంతేకాదు శ్రీలంక, ఉగాండ, బెలరస్‌, మాల్దీవులు, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన ట్రైబల్స్‌ కూడా హాజరయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలు పాల్గొన్నారు.ఇక తెలంగాణ గుస్సాడీ నృత్యం,ఏపీ గిరిజను థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. మొదటి స్థానంలో నిలిచిన బృందానికి రూ. 20 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన బృందానికి రూ.12 లక్షలు, మూడో స్థానం వారికి రూ.8 లక్షలు బహుమతిగా అందజేశారు.

Next Story