‘రాగల 24 గంటల్లో’ థియేట్రిక‌ల్ ట్రైలర్ రిలీజ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 12:01 PM GMT
‘రాగల 24 గంటల్లో’ థియేట్రిక‌ల్ ట్రైలర్ రిలీజ్‌

కొత్త త‌ర‌హా, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల ద్వారా న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్, తెలుగమ్మాయి ఇషా రెబ్బా జంటగా శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బేన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ నవహాస్ క్రియేషన్స్ బేన‌ర్‌పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ చిత్ర ట్రైలర్‌ను లెజెండరీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు విడుదల చేశారు.

ట్రైలర్ చూసిన తర్వాత ఆకట్టుకునే విధంగా ఉందని.. తనకు ట్రైలర్ చాలా బాగా నచ్చిందని దర్శక నిర్మాతలను ఆయన ప్రశంసించారు. 1.49 నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్ లో నా లైఫ్ లో ఏద‌యినా అదృష్టం ఉందంటే అది నువ్వు న‌న్ను పెళ్ళి చేసుకోవ‌డ‌మే…అంటూ స‌త్య‌దేవ్ చెప్పిన డైలాగ్‌, ఆ హంత‌కుడు ఎవ‌రో తెలియాలంటే అస‌లు అక్క‌డ ఏం జ‌రిగిందో చెప్పు అంటూ…హీరోయిన్ తో న‌టుడు శ్రీరాం చెప్పే డైలాగ్, ట్రైల‌ర్ చివ‌ర్లో నా భ‌ర్త‌ను నేనే చంపాను అంటూ ఇషా రెబ్బా చెప్పే డైలాగ్ చూస్తుంటే సస్పెన్స్ తో కూడిన ఇంట్రస్టింగ్ థ్రిల్లర్ గా రూపొందింది అని తెలుస్తోంది. ట్రైల‌ర్ అంతే థ్రిల్లింగ్‌నూ ఆసక్తి రేపుతోంది. ఇషా రెబ్బా నటనలో మరో మెట్టు ఎక్కినట్టు కనిపిస్తోంది. శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ నవంబర్ 15న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

Next Story