ప్రభాస్ 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ వచ్చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2020 11:29 AM IST
ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్. తాజాగా ఆయన జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ప్రభాస్‌ కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి 'రాధే శ్యామ్‌' అని టైటిల్‌ను పెట్టినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదే పేరును చిత్ర బృందం ఖరారు చేసింది. 'రాధే శ్యామ్'‌ ఫస్టు లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఈ ఫస్ట్‌ లుక్‌లో ఆకట్టుకుంది. ప్రభాస్‌, పూజా రొమాంటిక్‌ గా ఫోజ్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది. రెబర్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ టీ సిరీస్ వారు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో.. సీనియర్ నటి భాగ్యశ్రీ, జగపతిబాబు, స్టార్ కమెడియన్ ప్రియదర్శి, తమిళ నటుడు సత్యన్, మలయాళ నటుడు సచిన్ ఖేడేకర్, ఎయిర్టెల్ యాడ్ ద్వారా పాపులరైన షాషా ఛత్రి, బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్ ప్రముఖ నటుడు మురళి శర్మ నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ బాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ షెడ్యూల్‌ను జార్జియాలో లాక్‌డౌన్‌కు ముందే పూర్తి చేసుకుంది. అనంతరం లాక్‌డౌన్‌ కావడంతో.. ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేసింది. ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అనంతరం ప్రభాస్‌ మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు.

Next Story