మహిళకు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రిలో చేర్చిన సీపీ

By రాణి  Published on  28 Feb 2020 5:49 PM IST
మహిళకు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రిలో చేర్చిన సీపీ

రాచకొండ సీపీ మహేష్ భగవత్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. కీసర పీఎస్ పరిధిలోని నాగరం వద్ద రాణి అనే మహిళ స్కూటీపై వస్తుండగా..ఆమె వాహనాన్ని ఆటో ట్రాలీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయమైంది. అటుగా వెళ్తున్న సీపీ మహేష్ భగవత్ ప్రమాదాన్ని గ్రహించారు. వెంటనే వాహనాన్ని ఆపి బాధితురాలికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం తన ఎస్కార్ట్ వాహనంలో ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇలా సీపీ మహేష్ భగవత్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఎవరైనా ప్రమాదంలో ఉంటే సహాయం అందించాలని మంచి మెసేజ్ ఇచ్చారు.

ఈరోజుల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా చాలా మంది ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయడం మానేసి..ముందు తమ ఫోన్లలో ఆ ఫొటోలను, వీడియోలు తీసి, వాట్సాప్, ఫేస్ బుక్ లలో పోస్ట్ చేయడంలో నిమగ్నమవుతున్నారు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలంటే ఇది కాదు కదా. మనిషి ప్రాణాలు కాపాడటానికి టెక్నాలజీని ఉపయోగించాలి గానీ..మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కాపాడటం మానేసి ఫోన్లలో సెల్ఫీలు దిగడానికి ఉపయోగించకూడదు కదా. ఇప్పుడున్న సమాజం పరిస్థితి ఇది. పెద్ద పెద్దనగరాల్లో ఎక్కడైనా మేజర్ యాక్సిడెంట్ అయినా చూసీ చూడనట్లుగానే వెళ్లిపోతుంటారు. ఇలాంటి స్మార్ట్ టెక్నాలజీ అవసరమా మనకి అనిపిస్తుంటుంది.

Next Story