మునిగిపోతున్న నౌక‌లో 14,600 గొర్రెలు.. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 6:10 AM GMT
మునిగిపోతున్న నౌక‌లో 14,600 గొర్రెలు.. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం

మనుషులైనా, గొర్రెలైనా... సముద్రంలో మునిగిపోతుంటే...ఎవ‌రైనా చూస్తూ ఊరుకోరు. వాటిని రక్షించేందుకు పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు రొమేనియా రెస్క్యూ సిబ్బంది. క్వీన్ హింద్ అనే కార్గోనౌక... రొమానియాలోని మిదియా రేవు నుంచీ బయలుదేరిన కొద్దిసేప‌టికే. తీరం స‌మీపంలో నల్ల సముద్రంలో మునిగిపోతోంది. అందులో 14,600 గొర్రెలు ఉండటంతో... వాటిని ఎలా రక్షించాలో కూడా అర్థం కాని పరిస్థితి. నౌక‌లో14600 గొర్రెలు ఉన్నాయి. నౌకలోని 20 మంది సిరియన్ సిబ్బంది, ఒక లెబనీస్ వ్యక్తి కూడా ఉన్నారు.

Ship3

నౌక మునిగిపోతుండ‌టంతో రంగంలోకి దిగిన రొమేనియా రెస్క్యూ టీం ఒక్కొరిని రక్షించింది. నౌక ఒకేసారి పూర్తిగా మునిగి పోకుండా మెల్ల మెల్లగా మునిగిపోయే ద‌శ‌కు చేరుతుండ‌టంతో చాలావరకు గొర్రెలను కాపాడగలమని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బందికి, ఆర్మీ, పోలీసులు, డైవర్లు అందరూ సాయం చేస్తున్నారు. షిప్ ఓవర్ లోడ్ అవటమే నౌక మునిగిపోవ‌డానికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. కాగా, నౌకకు గ‌త‌ డిసెంబర్‌లోనే ఇంజన్ సమస్యలు ఉన్నాయని గుర్తించి పక్కకు పెట్టార‌ట‌. మళ్లీ అదే షిప్ ను గొర్రెల ఎగుమతికి ఉపయోగించటం సరికాదని ఎన్జీవో అనిమల్స్ ఇంటర్నేషనల్ మండిపడుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తోంది. రొమేనియా 2007లో EU లో చేరిన దేశం. ఇక్కడ గొర్రెలకు కొదువ లేదు. బ్రిటన్ స్టెయిన్ తర్వాత అత్యధికంగా గొర్రెలు గల దేశంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది పేద దేశం కూడా. ఆసియా దేశాలకు గొర్రలు ఎగుమతి చేయటం దేశానికి ప్రధాన ఆర్థిక వనరు.

Ship1

Ship2

Next Story