మాస్క్ లేకుంటే రూ.42 లక్షల ఫైన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2020 12:49 PM GMT
మాస్క్ లేకుంటే రూ.42 లక్షల ఫైన్

క‌రోనా వైర‌స్‌ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47.16ల‌క్ష‌లు దాటింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 3.12 ల‌క్ష‌ల మంది మృత్య‌వాత ప‌డ్డారు. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయినప్ప‌టికి చాలా దేశాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ఈ మ‌హ‌మ్మారికి ఇంకా మందును క‌నిపెట్ట‌లేదు.

లాక్‌డౌన్ ఉన్న‌ప్ప‌టికి ప్ర‌జ‌లు బ‌య‌ట తిరుగుతున్నారు. దీంతో గల్ఫ్ దేశం ఖతార్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగించేవారికి కఠిన ఆంక్షలు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సామాజిక దూరాన్ని పాటించడం, ముఖాలకు మాస్కులను ధరించడం తప్పనిసరి చేసింది. ఒక వేళ ముఖానికి మాస్క్ ధరించకుండా బయటకు వస్తే 2 లక్షల రియాల్స్ జరిమానా విధించ‌నుంది. 2 లక్షల రియాల్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 42 లక్షలతో సమానం. అయితే, జరిమానాతో వదిలిపెట్టడం లేదు. మాస్కు లేనివారి నుంచి 42 లక్షలు వసూలు చేయడంతో పాటు మూడేళ్ల పాటు జైలుకు పంపనుంది. ఇందులో ఎటువంటి మినహాయింపు ఉండదని పేర్కొంది.

ఖతార్ దేశ జ‌నాభా 28 ల‌క్ష‌లు. ఈ చిన్న దేశంలో 28వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంటే ల‌క్ష‌కు వెయ్యి కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్క‌శాతం జ‌నాభాకు క‌రోనా సోకింది. ఈ మ‌హ‌మ్మారి సోకిన వారిలో 14 శాతం మంది మ‌ర‌ణించారు. ఖ‌తార్ లో కేవలం నిర్మాణ రంగం తప్ప అన్నీ లాక్ డౌన్లో ఉన్నాయి.

Next Story