నెట్టింటిలో కలకలంరేపిన పూనమ్...!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 30 Oct 2019 12:27 AM IST

హాట్ బ్యూటీ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. హాట్ ట్వీట్‌తో నెట్‌లో కలకలం రేపారు. రీసెంట్‌గా ఆమె పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. "ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు... కానీ.. లీడర్ కాలేడు" అంటూ పూనమ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పూనమ్ ట్వీట్ చేశారని పవన్ ఫ్యాన్స్ మండిపడుతు న్నారు.
గతంలో కూడా పూనమ్ కౌర్ పలు ట్వీట్లతో కలకలం సృష్టించారు. పవన్ కళ్యాణ్‌పై పెట్టిన ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారాయి. మరీ ముఖ్యంగా, పవన్-పూనమ్‌ను లింక్ చేస్తూ కత్తి మహేష్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ రగడ మరింత ముదరకముందే ఆమె సైలెంట్ అయ్యారు. ఇంతకాలం కామ్‌గా ఉన్న పూనమ్, ఇప్పుడు మళ్లీ హాట్ ట్వీట్‌తో టాప్ లేపారు.
Next Story