పబ్జీ గేమ్‌లో ఓ మైన‌ర్ బాలిక‌కు.. యువకుడు వ‌ల వేసిన ఘ‌ట‌న నాంప‌ల్లి ఏరియాలో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ అనే యువకుడు అనే యువ‌కుడు పబ్జీ గేమ్ ఆడుతూ మైనర్ బాలికతో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆపై యువకుడు ఆ అమ్మాయితో చాటింగ్ చేసి వ్యక్తిగత సమాచారం తీసుకున్నాడు. వాట్సప్ నంబర్ ద్వారా చాట్ చేసి ప్రేమ పేరుతో.. అమ్మాయి పర్సనల్ ఫోటోలు సేకరించాడు.

ఆ త‌రువాత తనతో గడపక పోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు స‌ల్మాన్. విష‌యం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సోలీసులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డ సల్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితుడి మొబైల్ డేటా ఆధారంగా ఎంత మంది అమ్మాయిలను మోసం చేసాడో పోలీసులు కూపీ లాగుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story