ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె తల్లిపై..

By రాణి  Published on  22 Feb 2020 11:34 AM IST
ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె తల్లిపై..

ప్రేమించిన అమ్మాయి తనను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదని పగతో రగిలిపోయిన ఓ ప్రేమోన్మాది..యువతి తల్లిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ఓ సైనికోద్యోగి బాలాజీ నడింపల్లి గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఇది గమనించిన యువతి తల్లిదండ్రులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకున్న బాలాజీ వారిపై కక్ష పెంచుకుని..శనివారం తెల్లవారుజామున యువతి ఇంటికి వెళ్లి..డోర్ తట్టాడు.

తలుపు తీసిన యువతి తల్లిపై తన వద్దనున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇది గమనించిన ఆమె వెంటనే పక్కకు తప్పుకోవడంతో ఒక బుల్లెట్ ఆమె చెవికి తాకుతూ వెళ్లింది. ఆమె కేకలు విన్న స్థానికులు బాలాజీని పట్టుకునేందుకు ప్రయత్నించగా..తనవెంట తెచ్చుకున్న బ్యాగ్, తుపాకీ అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాలాజీ అక్కడకు వెళ్లేందుకు సహకరించిన ఆటో డ్రైవర్ రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి గుళ్లపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Next Story