మరదలిని నగ్నంగా ఫొటోలు తీసి..

కాలం గడిచే కొద్దీ మానవత్వం మంటగలిసిపోతోంది. వావి వరుసలు లేకుండా..చిన్నా, పెద్దా తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా..భార్య అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని ఆమె చెల్లెలిని నగ్నంగా ఫోటోలు తీసి ఫెస్ బుక్ లో పెట్టాడో దుర్మార్గుడు. బావ ఆగడాలను భరించలేని బాధిత యువతి గుంటూరు రూరల్ ఎస్పీ స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే..2010లో గుంటూరు జిల్లా కొల్లూరుకు చెందిన కె. రవికిరణ్ అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహమయింది. ఆమెకు ఒక చెల్లెలుంది. పెళ్లయ్యేనాటికి చెల్లెలి వయసు 15 ఏళ్లు. పెళ్లి తర్వాత భార్య అనారోగ్యానికి గురికావడంతో..రవికిరణ్ ఇంటి పనులు చేసేందుకు ఆమె చెల్లెలిని ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా చాలాసార్లు ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడని, తెలిసీ తెలియని వయస్సులో మోనంగా భరించేది. ఒకసారి బావకు ఎదురు తిరగడంతో..తన గురించి బయట ఎవరికైనా చెప్తే అక్క కాపురం నాశనమవుతుందని బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది.

2018 జూలైలో బాధిత యువతిని రవికిరణ్ తమిళనాడులోని వేళాంగిణి ఆలయానికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టి..తన కామ కోరికలు తీర్చుకున్నాడు. కుమార్తె కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రవికిరణ్ యువతితో తెనాలి పీఎస్ కు చేరుకుని..ఇష్టపూర్వకంగానే తాను బావతో వెళ్లినట్లు యువతితో చెప్పించాడు. తర్వాతి నుంచి రవికిరణ్ నిత్యం తన అక్కను కొట్టడం మొదలుపెట్టాడు. యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న అతను..యువతిని రహస్యంగా తీసిన నగ్న ఫొటోలను ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. అవి చూసిన యువతి సహనం నశించి పోలీసులను ఆశ్రయించింది. బావ చెర నుంచి తనను కాపాడటంతో పాటు..తన అక్క కాపురాన్ని కూడా సరిదిద్దాలని వేడుకుంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.