లోడ్ అవుతుంది.. పవన్ ఫ్యాన్స్ రెడీగా వున్నారా.?
By న్యూస్‌మీటర్ తెలుగు
ఎంతో కాలంగా తమ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పనున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత వెండితెరపై కనపడని పవన్.. తన అభిమానుల ఆతృతను తీర్చనున్నాడు. హిందీలో సూపర్ హిట్టైన 'పింక్' సినిమా రీమేక్‌లో పవన్ నటిస్తున్నారు.
ఈ సినిమాను కుటుంబ కథా చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు ఆస్థాన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకుడవడం విశేషం. కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ప్రారంభయిన ఈ సినిమా.. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు 'వకీల్ సాబ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయమై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
ఇదిలావుంటే.. మార్చి రెండో తేదీన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతుంది. అదే రోజున టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటిస్తారు. అంతేకాదు.. ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా సినిమాలోని పస్ట్ సాంగ్‌ను కూడా విడుదల చేస్తారనే టాక్ వినపడుతుంది. దీంతో.. ఒకే వారంలో రెండు సర్‌ప్రైజ్‌లు రావడంతో.. చాలా రోజులుగా పవన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు నిజంగా పండగే.