కలకలం రేపుతోన్న పృథ్వీ ఫోన్‌ సంభాషణ.. మహిళా ఉద్యోగినితో..

By Newsmeter.Network  Published on  12 Jan 2020 4:43 AM GMT
కలకలం రేపుతోన్న పృథ్వీ ఫోన్‌ సంభాషణ.. మహిళా ఉద్యోగినితో..

ఓ మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ ఫోన్‌లో కామ సంబాషణ కొనసాగించినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్‌ చైర్మన్‌, నటుడు పృథ్వీ రాజ్‌ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధిష్టానం పృథ్వీ చేష్టలపై సీరియస్‌గా ఉంది. తాజాగా ఒక మహిళా ఉద్యోగినితో మాట్లాడుతూ.. తనకు లైంగిక వాంఛ తీర్చాలంటూ ఫోన్‌ సంబాషణ పృథ్వీ పేరిట లీక్‌ కావడం ఇప్పుడు ఎస్వీబీసీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆడియో ఖచ్చితంగా పృథ్వీనే మాట్లాడారా లేకా ఇంకేవరైనా మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. ఆడియోలో.. నువ్వంటే నాకు ఇష్టమని, మనం కలిసి మాట్లాడుకోవాలని, మద్యం సేవించాలని అంటూ సంబాషణలు ఉన్నాయి. ఐ లవ్‌ యూ అంటూ ఆ మహిళా ఉద్యోగినితో మాట్లాడిన ఆడియో రాసలీలలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఆడియో లీక్‌పై నటుడు పృథ్వీరాజ్‌ స్పందించాల్సి ఉంది.

శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎస్వీబీసీకి చైర్మన్‌గా పృథ్వీరాజ్‌ ఉన్నారు. రాజధాని రైతులపై పృథ్వీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి శ్రీవారి ప్రతిష్టను కించపరిచే విధంగా ఉందంటూ పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే టీటీడీలో పని చేస్తున్న మహిళలతో చాలా గౌరవంగా ఉండాలంటూ నిబంధనలు ఉన్నాయి. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయి. గతంలో ఓ శ్రీవారి భక్తురాలు బట్టలు సరిగ్గా లేవని, శ్రీవారి సేవ చచేసే వారు పవిత్రంగా ఉండాలని ఒక ఉద్యోగి చెప్తే, ఆయనపై టీటీడీ సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం శ్రీవారికే కలంకం తెచ్చే విధంగా ఉంది. ఇప్పుడు మహిళ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడింది ఒకవేళ పృథ్వీనే అయితే టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే ఎస్వీబీసీ చైర్మన్‌, నటుడు పృథ్వీరాజ్‌పై వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. రాజధాని రైతులపై పృథ్వీ ఇష్టానుసారంగా మాట్లాడటంపై అధిష్టానం సీరియస్‌ అయ్యింది. పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వైసీపీ పార్టీ సిద్ధమయ్యింది. కులాలు ప్రస్తావిస్తూ ఎవర్నీ కించపర్చేలా మాట్లాడొద్దని పార్టీ నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. రాజధాని ఆందోళనల్లో ముసుగులో గుద్దులాటలా కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులు ఆందోళన చేస్తున్నారంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Next Story