ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 10:36 AM GMT
ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం..!

హైదరాబాద్‌: నిన్న కార్మికులు చేపట్టిన ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం విజయవంతమైందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఛలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న జరిగిన దమనకాండపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడంపై మండిపడ్డారు. రేపు.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. నిన్న జరిగిన దమనకాండను ఖండించాలన్నారు.

రేపు ఒక్క రోజు నలుగురు ఆర్టీసీ జేఏసీ ముఖ్య నేతలు నిరాహార దీక్ష చేపడతారని తెలిపారు. ఈ నెల 13, 14న ఢిల్లీలో మానవహక్కుల కమిషన్‌, మహిళా కమిషన్‌ కలుస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. తర్వాత ఫొటో ఎగ్జిబిషన్‌.. 18న సడక్‌ బంద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి చర్చలు జరిపేలా కృషి చేయాలన్నారు. నిన్న ఛలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు మాత్రేమే పాల్గొన్నాయని.. మావోయిస్టులు పాల్గొన్నారని పోలీసులు తప్పుగా అపాదించవద్దని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి కోరారు.

Next Story
Share it