జగన్‌ సర్కార్‌ వేటు వేసిన అధికారికి పదోన్నతి

By సుభాష్
Published on : 22 April 2020 8:22 PM IST

జగన్‌ సర్కార్‌ వేటు వేసిన అధికారికి పదోన్నతి

కృష్ణ కిశోర్‌కు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పని చేసిన కృష్ణకిశోర్‌.. అవకతవకలు జరిగాయంటూ వైసీపీ సర్కార్‌ ఆయనను సస్సెండ్‌ చేసింది. ఈ మేరకు ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అయితే అప్పట్లో కృష్ణకిశోర్‌పై వేటు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. వైసీపీ సర్కార్‌ అవినీతి అంశాలను బయటపెట్టారనే కారణంగా కృష్ణకిశోర్‌ను సస్పెండ్‌ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ఆరోపణలు గుప్పించారు. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిని సస్పెండ్‌ చేయడం జగన్‌కు లేదని చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దూమారం రేపింది.

Next Story