ఏపీలో అధికారులను కలవర పెడుతున్న ఆ 52 కరోనా కేసులు

By సుభాష్  Published on  22 April 2020 12:46 PM GMT
ఏపీలో అధికారులను కలవర పెడుతున్న ఆ 52 కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారిలో 52 మందికి కరోనా వైరస్‌ ఎలా వచ్చిందో తెలియడం లేదని అన్నారు. వారి మూలాలు కనిపెట్టేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు.

ఆ ప్రాంతాల్లో బృందంతో సర్వే

కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్యాధికారితో కూడిన ఓ బృందం ఏర్పాటు చేసినట్లు, ఆ బృందం సర్వే నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. ర్యాపిడ్‌ పరీక్ష కిట్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఐసీఎంఆర్‌ ఆదేశించినందున ఐదు ప్రత్యేక యంత్రాలు తెప్పించినట్లు పేర్కొన్నారు. ఈ యంత్రాలతో గంటకు వంద పరీక్షలు చేయవచ్చని అన్నారు.

Next Story
Share it