హుజూర్ నగర్ టీఆర్‌ఎస్ విజయంపై ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2019 9:25 AM GMT
హుజూర్ నగర్ టీఆర్‌ఎస్ విజయంపై ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ..!

* ప్రభావం చూపని ఆర్టీసీ సమ్మె

* ఫలించని ప్రతిపక్షాల వ్యూహాలు

* డిపాజిట్ దక్కని బీజేపీ

ఏడాదిలోపు అర లక్ష మంది ఓటర్లు తమ రాజకీయ పరమైన నిర్ణయాన్ని మార్చుకోడం ఎన్నికల చరిత్రలోనే అపూర్వఘట్టం అనే చెప్పాలి. టిఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికలలో సుమారు 7,000 ఓట్ల తేడాతో హుజుర్ నగర్ సీటును కోల్పోయింది. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగిన పోటీలో 43వేల 284 ఓట్ల తేడాతో సీటును కైవసం చేసుకుంది. 50 వేల కాంగ్రెస్ సాంప్రదాయక ఓటర్లు టిఆర్ఎస్ కు బదిలీ అవ్వడాన్ని ఈ విజయం సూచిస్తుంది. ఒక సంవత్సరంలో ఓటర్లు తమ రాజకీయ విధేయత మార్పు ఖచ్చితంగా విశ్లేషించాల్సిన విషయం.

వాస్తవానికి హర్యానా, మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికలలో బిజేపి ఓట్ల శాతాన్ని గతంతో పోలిస్తే భారీ స్థాయిలో నష్టపోయిందనే చెప్పాలి. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో హర్యానాలో 21 శాతం, మహారాష్ట్రలో 9 శాతం ఓట్లను బిజెపి కోల్పోయింది.

అధికార బిజెపి ,శివసేన సంకీర్ణానికి 2019 లోక్‌సభ ఎన్నికలలో 51 శాతం ఓట్లు పోల్ అవ్వగా ఇప్పుడు కేవలం 42 శాతానికి పైగా మాత్రమే ఓట్లను కైవసం చేసుకుంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 58 శాతం ఓట్లు సాధించిన బిజెపి ఇప్పుడు 36.5 శాతానికి పడిపోయింది. 2019లో కాంగ్రెస్ ఇంత దయనీయ పరిస్థితిలో లేకపోయి ఉంటే ఈ తేడా చాలా కనిపించేది.

అయితే రెండు రాష్ట్రాల ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నికకు మధ్యలో గుర్తించదగిన ఒక వ్యత్యాసం ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో ఒకే సీటులో ఎన్నికల పోల్చడమనేది ఓ సవాల్ . లోక్ సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉంటే ..అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యల ఆధారంగా గెలుపు ఓటములు ఉంటాయి. హుజూర్ నగర్ లో ప్రతిపక్ష పార్టీల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో అధికార పార్టీ విజయం సాధించింది.

హుజూర్ నగర్ కాంగ్రెస్ కు కంచుకోట. టీఆర్‌ఎస్ పట్టుకోసం అన్ని విధాలా వ్యూహాత్మకంగా పోరాడింది. గత మూడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ సీటును గెలుచుకుంది. ఉప ఎన్నికలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అతని భార్య పద్మను అభ్యర్థిగా నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌ సభకు ఎన్నిక అవడంతో కాంగ్రెస్ హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ను కోల్పోవాల్సి వచ్చింది. 2018 -19లో కాంగ్రెస్, ఉత్తమ్ బలమెంతో ఒక సంవత్సరంలో రెండు సార్లు నిరూపించబడింది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం ఉన్నప్పటికీ హుజూర్ నగర్ లో విజయం సాధించలేదు.

బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ కు అనుకూలంగా మలుచుకున్నది. ఈ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రభావావం అధికంగా ఉంది. అసెంబ్లీ విభాగంలో సామాజిక, భౌగోళిక విభజనకు సంబంధించిన ఓటర్లు ఈ రచయితతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ పదవీకాలంలో మంత్రిగా, శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ నియోజకవర్గ అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందనే విస్తృతమైన భావన నియోజకవర్గ ప్రజల్లో ఉంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌తో సహజమైన అనుబంధం ఉన్న రెడ్డి ఓటర్లు ఉన్నారు. ఈ నియోజక వర్గంలో షెడ్యూల్డ్ కులం (మాదిగా), షెడ్యూల్డ్ ట్రైబ్ (లాంబాడి) ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ తో ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ కు బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నారు. అయినప్పటికీ టిఆర్ఎస్ ఈ సీటును దక్కించుకోగలిగింది. అది కూడా రాజకీయ నాయకులు, ఎన్నికల అధికారులు సైతం ఆశ్చర్యపరిచే విధంగా అపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ రాజకీయ మార్పుకు ఏ అంశాలు కారణమయ్యాయి ? అనే అంశంతోపాటు రాబోయే నాలుగేళ్లలో తెలంగాణలో రాజకీయ పరిణామాలకు దారితీస్తోందో అంచనా వేయెచ్చు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించైనా, రాజకీయ కుతంత్రాలు ఉన్నప్పటికీ పాలక టిఆర్ఎస్ ప్రజలలో మద్దతును పొందగలిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె కూడా ప్రజల్లో పాలక పార్టీ పట్ల వ్యతిరేకతను రేకెత్తించడంలో విఫలమైంది.

అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, మద్యం,డబ్బులను పంపిణీ చేసి పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి అయితే కాంగ్రెస్, బీజీపీలు పదే పదే ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ వ్యూహాలు సఫలీకృతం కాకుండా అధికార పార్టీ చేసిన ఎత్తుగడలు ఫలించాయి. ఇది అసాధారణమైన విషయం కాదు. ప్రతీ రూలింగ్ పార్టీ ఇదే ఇదే వ్యూహాన్ని అమలు చేస్తుంది. బై పోల్ ఎన్నికల ఫలితాలు సాధారణంగా అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాలు అదే పార్టీ అధికారంలో ఉంటుంది.

అధికార టీఆర్‌ఎస్‌పై మరో ఆరోపణ కూడా ఉంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున మంత్రులను, నాయకులను నియోజకవర్గంలో నియమించింది. కాంగ్రెస్ తో పాటు ఉన్న నియోజక వర్గం కావడంతో టీఆర్‌ఎస్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో అధికార పార్టీ తన సర్వశక్తులోడ్డింది. మరో పక్క టీఆర్‌ఎస్‌ అధికార బలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని దిగ్బంధించింది. టీఆర్‌ఎస్ నమోదు చేసిన ఈ భారీ విజయాన్ని వర్ణించడం సాధ్యం కాదు. ఇదంతా ఓటమి తరువాత కాంగ్రెస్ నేతల మౌనంతోనే అర్ధమవుతుంది.

ఏళ్ల తరబడి కాంగ్రెస్ నేతలు, నాయకుల తీరుతో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. దీనితో పోల్చితే నేతల పార్టీ ఫిరాయింపులు సమస్యే కాదని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది .

హుజూర్ నగర్ లో టీఆర్‌ఎస్ భారీ విజయం ఏం చెబుతోంది ?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎలక్షన్స్ పోల్స్ వ్యతిరేకంగా ఉన్నపటికీ కేసీఆర్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కారణం. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు కేసీఆర్ కొత్తగా ప్రవేశపెట్టిన రైతుబంధు, ఆసరా పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాలతో లబ్ది చేగురింది. ఈ బై ఎలక్షన్ లో టీఆరెస్ అభ్యర్థికంటే కేసీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయనే చెప్పాలి.

వాస్తవానికి నియోజక అభివృద్ధికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కృషిని రాజకీయ విమర్శకులు సైతం గుర్తించారు. ఏది ఏమైన కాంగ్రెస్ రాష్ట్రం లో, కేంద్రంలో అధికారంలో లేదు. కనీసం అధికార పార్టీ నాయకుడిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే టీఆర్‌ఎస్‌ వాదనను ఓటర్లు ఏకీభవించి వుంటారు.

హుజూర్ నగర్ ఎన్నికలో టీడీపీ సాంప్రదాయ ఓట్లు, ఓబీసీ ఓట్లు అన్నీ టీఆర్‌ఎస్ వైపుకు మళ్లాయనే చెప్పాలి. లోక్‌సభ ఫలితాల మాదిరిగా బలం పపుంజుకునేందుకు బీజేపీ ప్రయతించింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పే బీజేపీ, కాంగ్రెస్ కు కూడా ఏ దశలో పోటీ నివ్వలేదు. బీజేపీ అసత్య ఆరోపణలకు హుజూర్ నగర్ ఎన్నిక ఫలితమే సమాధానం చెప్పిందని ఫలితాలు వెలువడిన వెంటనే కేసీఆర్ మాట్లాదారు. ఇంత వ్యతిరేకతల మధ్య ప్రతిపక్ష పార్టీలతో పోల్చితే స్పష్టమైన మెజారిటీ దక్కింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్టే అనే ఎన్నికల నినాదం లాభించింది.

-ప్రొ. నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ

Next Story
Share it