ఫామ్‌లోకి వ‌చ్చిన బ్యూటీ.. వ‌చ్చీ రాగానే స‌గం బ‌ట్ట‌ల‌తో ద‌ర్శ‌న‌మిచ్చింది..!

By అంజి  Published on  27 Jan 2020 3:31 AM GMT
ఫామ్‌లోకి వ‌చ్చిన బ్యూటీ.. వ‌చ్చీ రాగానే స‌గం బ‌ట్ట‌ల‌తో ద‌ర్శ‌న‌మిచ్చింది..!

అగ్ర హీరోల‌కు మించిన స్టేట‌స్‌ను సినీ ఇండ‌స్ట్రీ ఆమెకు క‌ట్ట‌బెట్టింది. అయినా ఏ మాత్రం లెక్క చేయ‌కుండా మ‌కాం మార్చేసింది. మ‌ళ్లీ ఇక్క‌డ సినిమాలు ఎప్పుడ‌ని ప్ర‌శ్నిస్తే అదిగో.. ఇదిగో అంటూ స‌మాధానాలు దాట‌వేస్తూ వ‌స్తోంది. త‌న‌ను మ‌ళ్లీ తెర‌పై చూడాల‌న్న అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతోంది. దీంతో త‌మ అభిమాన న‌టిని దూరం చేసిన తెల్లోడిపై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం ఆ తెల్లోడే చేశాడ‌య్యా! హ‌ఠాత్తుగా ఊడిప‌డి మా హీరోయిన్‌ని ల‌టుక్క‌న ప‌ట్టుకెళ్లాడ‌య్యా అంటూ వారు ఆక్రోశం వెల్ల‌గ‌క్కుతున్నారు. ఏదేమైనా న‌మ్మిన పాపానికి వారైనా ఏం చేస్తారులేండి!

ఇంత‌కీ, ఆ బ్యూటీ ఎవ‌ర‌న్న‌ది ఈ పాటికే మీకర్ధ‌మై ఉంటుంది. అవును, మీరు ఊహించిన ప్రియాంక చోప్రానే ఆ భామ‌. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్ సింగ‌ర్‌ నిక్ జోన‌స్‌ను పెళ్లాడి అమెరికాకు చెక్కేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ జంట‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ విష‌యాల‌ను స్వ‌యాన‌ నిక్ జోన‌స్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఫోటోల‌లో నిక్ జోన‌స్‌, ప్రియాంక చోప్రా ఇద్ద‌రూ తెల్ల‌టి చొక్కాల‌తో క‌నిపిస్తారు. పెళ్లి త‌రువాత ఎంతో అన్యోన్యంగా గ‌డుపుతున్న వారిని చూసి నెటిజ‌న్లు సైతం ప్ర‌శంసిస్తున్నారు.

కాగా, స్వ‌త‌హాగా సింగ‌ర్ అయిన నిక్ జోన‌స్ త‌న సోద‌రుల‌తో క‌లిసి ఆల్బ‌మ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్రమంలోనే వారు చేసిన స‌రికొత్త ఆల్బ‌మ్‌లో ప్రియాంక చోప్రాను కూడా భాగం చేశారు. ఆ ఆల్బమ్‌లో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి చాలా స్టైల్‌లో క‌నిపించింది. ఈ వీడియో వ్యూస్ ఇప్ప‌టికే రెండు కోట్ల‌కు దాటింది. ప్రియాంక చోప్రాతో పాటు, నిక్ జోన‌స్ సోద‌రులు కెవిన్ జోనాస్, జో జోనాస్ భార్యలు కూడా ఈ ఆల్బ‌మ్‌లో క‌నిపించారు.

అయితే, ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో చివ‌ర‌గా 'ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో క‌నిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, నటి జైరా వాసిమ్, రోహిత్ షరాఫ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సుమారు 3 సంవత్సరాల క్రితం విడుద‌లైంది. ఆ త‌రువాత ప్రియాంక బాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌లేదు. బాలీవుడ్‌కి బై చెప్పి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక క్వాంటికో అనే హిట్ సిరీస్‌లో న‌టించింది. ఇది అమెరికా ఏబీసీ ఛానెల్‌లో మూడు సీజన్లలో ప్రసారం చేయబడింది.

Next Story
Share it