క్రేజీ బ్యూటీకి ఛాన్స్ లు వస్తున్నాయ్..!

By అంజి  Published on  18 Dec 2019 3:37 AM GMT
క్రేజీ బ్యూటీకి ఛాన్స్ లు వస్తున్నాయ్..!

సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ తో పాటు స్టార్ డమ్ ని సంపాదించింది యంగ్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ స్టార్ డమ్ కి తగ్గట్లుగానే మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. ఆ దెబ్బకి వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఆ తరువాత ప్రియా హీరోయిన్ గా నటించిన 'ఓరు అదార్ లవ్' సినిమా 'లవర్స్ డే' పేరుతో తెలుగులోకి డబ్ అయి అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రియా ప్రకాష్ ఆశలకు బ్రేకులు పడ్డాయి. అప్పటికీ ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది. ప్రస్తుత పరిస్థితికి వస్తే.. మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా ముందు మీ చిత్రంలో ఒక అవకాశం ఇవ్వండని అందర్నీ అడుగుతుందట.

మొత్తానికి ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో మాత్రం ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె టాలీవూడ్ నే టార్గెట్ చేసుకుంది. దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది టాలీవుడే. అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న. ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది. కాగా ఇప్పుడు వీళ్ళ మాదిరిగానే ప్రియా కూడా పయనించబోతుందట.

ఈ క్రమంలోనే హీరో నితిన్ కొత్త చిత్రంలో ప్రియా సెకెండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తుంది. అలాగే మరో సినిమాలో కూడా నటించబోతుందట. నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు సినిమాల్లో తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు ప్రియాకి బాగానే వస్తాయి. అయితే ప్రియా ప్రకాష్ కి ఎక్కువుగా సెకెండ్ హీరోయిన్ అవకాశాలే వస్తున్నాయి. అందుకే అవకాశం వచ్చినప్పుడే అందుకోవాలనేది.

Next Story