పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న షాహి మస్జిద్ కూడా తమ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంది. రాబోయే ‘జాగ్నే కి రా’ పండుగ విషయంలో కూడా సరికొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. మౌలానా అహ్ సాన్ హమూమి ఖతీబ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న నేపథ్యంలో సరైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని.. ఎక్కువ సంఖ్యలో మసీదులో నమాజ్ కు రావడం కూడా వైరస్ ప్రబలడానికి కారణమవుతుందని అన్నారు.

జమాయిత్ ఏ ఉలామా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని మసీదులకు పలు సూచనలు జారీ చేసింది. మసీదుల్లోనూ, షాదీ మహల్ వంటి వాటిలో ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించరాదని అన్నారు. జమాయిత్ ఏ ఉలామా ప్రెసిండెంట్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ మాట్లాడుతూ.. మేనేజింగ్ కమిటీలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని.. మసీదుల్లో ప్రార్థనలకు సంబంధించి ఏడూ నిమిషాల ముందు సూచనలు జారీ చేయాలని.. ప్రార్థనలు ముగిసిన వెంటనే మసీదులను మూసివేయాలని అన్నారు. ఎటువంటి కార్యక్రమాలను, పెద్ద ఎత్తున ఎవరూ ఉండకూడదని అంటున్నారు. హైదరాబాద్, మలక్ పేట్ లోని మసీదును కూడా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

దేవాలయాలు కూడా మూసివేత

హైదరాబాద్ లోని అన్ని దేవాలయాలను కూడా మార్చి 31 వరకూ మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. గుళ్ళలో ఎప్పటికప్పుడు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెబుతున్నారు. అది కూడా తక్కువ మంది పూజారులతోనే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గత కొద్ది రోజులుగా తాము కొందరు భక్తులను మాత్రమే గుడి లోకి అనుమతి ఇస్తున్నామని.. ప్రభుత్వం కీలక సూచనలు చేసిన నేపథ్యంలో గుడిని మూసివేస్తున్నామని ఓ పూజారి తెలిపారు. దేవుడికి కైంకర్యం సేవలు మాత్రం పూర్తిగా జరుగుతూ ఉంటాయని వారు తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.