ఢిల్లీ: దేశ రాజధాని కాలుష్యం కోరలు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాను కూడా తాకాయి. కాలుష్యం కారణంగా షూటింగ్‌ చేయడం చాలా కష్టంగా మారిందని.. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నివసించడం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తోందని ప్రియాంక చోప్రా అన్నారు.

గాలి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఎయిర్‌ ఫ్యూరిఫైయర్లు ఉన్నాయి.. కానీ ఇల్లు లేని నిరాశ్రయులు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థించండి అంటూ ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.

కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి మాస్క్‌, కళ్లద్దాలు పెట్టుకొని ప్రియాంక సినిమా సెట్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా ‘ది వైట్‌ టైగర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత అరవింద్‌ అడిగా రాసిన ‘ది వైట్‌ టైగర్‌’ పుస్తకం ఆధారం చేసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ సినిమాతో ప్రియాంక చోప్రా మంచి విజయం అందుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.