'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్. ఆ సినిమా తర్వాత ఆడపదడపా సినిమాలు చేసుకుంటు వస్తోంది. సినిమా అవకాశాల కోసం తన అందాలను ఆరబోస్తూ.. కుర్రకారును కాక రేపుతోంది. తాజాగా పవన్ సరసన నటించేందుకు ఈ భామ ఓకే చెప్పింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సరసన ప్రజ్ఞా జైస్వాల్ నటించబోతోంది. ఇప్పటికే ఆమెతో క్రిష్ సంప్రదింపులు జరిపాడు.