'పవర్ స్టార్' మూవీ ట్రైలర్ విడుదల.. ఫ్రీగా చూడొచ్చన్న వర్మ
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 11:00 AM ISTనిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెర్కెక్కిస్తున్న చిత్రం ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు వర్మ. అంతకముందు వర్మ మరో ట్వీట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ లీకైందని, దీని వెనుక తన ఆఫీసు స్టాప్ హస్తం ఉందని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ట్రైలర్ ను వీక్షించేందుకు రూ.25 చెల్లించిన వారందరికి నగదును తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఏదేమైనా తాను ఇప్పుడు ఏం చేయలేనని, యూట్యూబ్‌లో హై రిజల్యూషన్ వర్షన్‌లో ట్రైలర్‌ను విడుదల చేయడమే తన ముందున్న మార్గమని పేర్కొంటూ ట్రైలర్ రిలీజ్ చేశారు.
వర్మ ఈ సినిమా ప్రకటించిన అప్పటి నుండి ప్రజల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. వర్మ ఏం చూపించబోతున్నాడో అంటూ సినీ, రాజకీయ వర్గాలలో ఈ సినిమాపై చర్చలు మొదలయ్యాయి.అయితే సినిమా ప్రకటించిన నాటి నుండి సినిమాకు సంబంధించి వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించారు వర్మ. ఈ చిత్రం ఈ నెల 25 విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపారు. ఈ చిత్రాన్ని చూడాలంటే.. అడ్వాన్స్ బుకింగ్‌కు రూ.150 చెల్లించాలని, బ్లాక్ బుకింగ్‌కు 250 చెల్లించాలని ట్వీట్ చేశారు వర్మ.