పవన్ కోసం క్రిష్ రెడీ చేస్తోన్న కథ ఏంటో తెలుసా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ... ఇప్పటి వరకు అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. అయితే... పవన్ కోసం దర్శకులు కథలు రెడీ చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ లో పవన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్రిష్, హరీష్ శంకర్‌లు పవన్ కోసం కథ రెడీ చేస్తున్నారని టాక్ వచ్చింది.
తాజా వార్త ఏంటంటే... పవన్ పింక్ రీమేక్ లో కానీ, క్రిష్ దర్శకత్వంలో కానీ నటించనున్నారని తెలిసింది. ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే... క్రిష్ పవన్ కోసం రెడీ చేస్తోన్న కథ జానపద కథ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు పవన్ ఈ తరహా సినిమాలో నటించలేదు. అందుచేత పవన్‌కి ఇది కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం క్రిష్ ఫుల్ స్ర్కిప్ట్ రాశారట. త్వరలోనే పవన్ పింక్ రీమేక్ చేయడమా..? క్రిష్‌తో సినిమా చేయడమా..? అనేది ఫైనల్ చేస్తానన్నారు.
వందల ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా క్రిష్ ఈ కథ రాశారు. ఇందులో చారిత్రక అంశాలుంటూనే, జానపద శైలిలో సాగిపోయే కమర్షియల్ సినిమా అని తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. పవన్ - క్రిష్ కాంబినేషన్‌లో జానపద చిత్రాన్ని చూడచ్చు.