ప‌వ‌ర్ స్టార్ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్.. ఇంత‌కీ ఎవ‌రితో...?

By Newsmeter.Network  Published on  18 Dec 2019 5:45 AM GMT
ప‌వ‌ర్ స్టార్ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్.. ఇంత‌కీ ఎవ‌రితో...?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లోకి వెళ్లిన‌ప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి వ‌స్తారా..? అని అభిమానులు వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. ప‌వ‌న్ రీ ఎంట్రీకి రంగం సిద్ధ‌మైంది. అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అదే పింక్ రీమేక్. ఎం.సి.ఎ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) చిత్ర ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉండ‌డం వ‌ల‌న ఇప్పుడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేస్తే బాగోదు క‌నుక త‌న ఇమేజ్ త‌గ్గ‌ట్టుగా ఉండే పింక్ రీమేక్ ను ఎంచుకున్నార‌ట‌. అయితే.. ఈ మూవీ త‌ర్వాత భారీ మ‌ల్టీస్టార‌ర్ చేసేందుకు ప‌వ‌న్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఎవ‌రితో అంటారా..? మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో. అవును.. ప‌వ‌న్ చ‌ర‌ణ్ తో ఎప్ప‌టి నుంచో సినిమా చేయాల‌నుకుంటున్నారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్ కాలేదు.

పింక్ రీమేక్ త‌ర్వాత చ‌ర‌ణ్ తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట ప‌వ‌న్. ఈ భారీ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై త‌నే స్వ‌యంగా నిర్మిస్తాడ‌ట‌. పింక్ సినిమాకి ప‌వ‌న్ 25 రోజులు మాత్ర‌మే డేట్స్ ఇచ్చార‌ట‌. అందుచేత ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ వ‌చ్చే సంవత్స‌రంలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ కొంత మంది ద‌ర్శ‌కులు ప‌వ‌న్ - చ‌ర‌ణ్ ఇద్ద‌రికీ సెట్ అయ్యే క‌థ పై క‌స‌రత్తు ప్రారంభించార‌ట‌. మ‌రి.. ఈ భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌కెక్కించే ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

Next Story
Share it