తీరు మార్చుకోమంటే మార్చుకోదు.. పూనమ్ అరెస్ట్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2020 4:34 PM ISTపూనమ్ పాండే.. ఈ బాలీవుడ్ ముద్దు గుమ్మ పేరు ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటుంది. పెద్దగా సినిమా ఆఫర్లు లేకపోవడంతో హాట్ హాట్ వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఈ హాట్ వీడియోలకు ఆమె ఎంచుకునే లొకేషన్స్ ఆమెను ఆఖరికి కటకటాలపాలయ్యేలా చేశాయి. తాజాగా పూనమ్ పాండేను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.
పూనమ్ ఇటీవల గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేసింది. పూనమ్ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది. గోవా సంస్కృతి, చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకే కేసు పెట్టామని గోవా ఫార్వర్డ్ మహిళా విభాగం చెబుతోంది. ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు పూనమ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కొద్దిరోజుల కిందట పూనమ్ పాండే సామ్ బాంబేను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పై దక్షిణ గోవాలోని కెనకోనా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. తనపై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టినట్లు పూనమ్ ఆరోపించింది. సామ్ బాంబే బెయిల్ పై విడుదలయ్యాక మళ్లీ అతడితో కలిసిపోయింది. ఇప్పుడు ఆమె చేసిన అశ్లీల వీడియోలకు అరెస్ట్ ను ఎదుర్కొంటోంది.