ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన పూన‌మ్ బ‌జ్వా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 8:38 AM GMT
ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన పూన‌మ్ బ‌జ్వా

పూనమ్ బజ్వా తెలుగులో ‘మొదటి సినిమా’తో పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన ‘బాస్’, అల్లు అర్జున్ ‘పరుగు’లో సెకండ్ హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. బుధ‌వారం ఆమె త‌న బాయ్‌ప్రెండ్ సునీల్ రెడ్డిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది. త‌ను ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెబుతూ.. అత‌డికి పుట్టిన రోజు శుభాకంక్ష‌లు చెప్పింది.

‘సునీల్‌ రెడ్డి.. మై రూట్స్‌, గ్రౌండ్‌, వింగ్స్‌. హ్యాండ్సమ్‌, అందమైన హృదయం ఉన్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌ మేట్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో ప్రేమ, ఫన్‌, సంతోషం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మాటల్లో చెప్పలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అని పూనమ్‌ ప్రియుడిపై ఉన్న ఇష్టాన్ని తెలియ‌జేసింది. దీంతో ప‌లువురు సినీ నటుల‌తో పాటు అభిమానులు ఆమెకు శుభాకాంక్ష‌లు అందించారు. ఈ ఫోటోల‌ను బ‌ట్టి చూస్తే పూన‌మ్ చాలా రోజులుగానే సునీల్‌రెడ్డితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు అర్థం అవుతోంది.

పూన‌మ్ బ‌జ్వా తెలుగులో కంటే ఎక్కువ మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనే న‌టిచింది. గ‌త ఏడాది ఎన్టీరామారావు జీవితం ఆధారంగా తెర‌కెక్కిన య‌న్‌.టి.ఆర్ : క‌థానాయ‌కుడు చిత్రంలో అతిథిగా మెరిసింది. ఆపై కుప్ప‌తు రాజా అనే త‌మిళ చిత్రంలో సంద‌డి చేసింది.

Next Story