నా నుండి రాయబారాలు లేవు: వైవీ సుబ్బా రెడ్డి

వైస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  2 Jan 2024 12:15 PM GMT
yv subba reddy, comments,  ys sharmila, politics,

నా నుండి రాయబారాలు లేవు: వైవీ సుబ్బా రెడ్డి

వైస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మని నెల రోజుల తర్వాత హైదరాబాద్‌లో కలిసేందుకు వెళ్లానని.. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అని ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని.. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగిందన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని చెప్పారు. దాడి వీరభద్రరావుకి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని.. అయన రాజీనామా చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజమన్నారు. జగన్‌ను ఎదుర్కొనలేక ఇలా కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

షర్మిళ కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఎందుకంటే మాకు ప్రజా మద్దతు ఉంది కాబట్టి. ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల‌ కుటుంబాల్లో మార్పు వచ్చిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఎవరి కోసమూ నేను షర్మిలతో రాయబారం చేయటం లేదని.. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం వలన ప్రజలు మాకు నీరాజనం పలుకుతున్నారు. ఇది చూడలేక ఎల్లోమీడియా వారికి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. రెండు మూడు వారాలకొకసారి నేను హైదరాబాదు వెళ్తుంటా. కుటుంబ సభ్యులను కలుస్తుంటా. విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశాను. కానీ యెల్లో మీడియా రాతలు పరాకాష్టకు చేరాయి. కుటుంబ సభ్యులనూ కూడా బజారుకీడ్చే పని చేస్తోంది. చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు వైవీ సుబ్బా రెడ్డి.

Next Story