ముగిసిన షర్మిల ఢిల్లీ పర్యటన..కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై ఏమన్నారంటే..

కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ నాయకులు, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2023 6:53 AM IST
YSRTP, Sharmila, Delhi Tour, Congress, Joining,

 ముగిసిన షర్మిల ఢిల్లీ పర్యటన..కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై ఏమన్నారంటే..

కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ నాయకులు, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ నాయకులు షర్మిలను కోరుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీవెళ్లిన షర్మిల పలువురు నాయకులతో వరుస సమావేశాలు అయ్యింది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. అయితే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే మీడియా ప్రతినిధులు షర్మిలను పార్టీ విలీనం గురించి పలు ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె సరైన సమాధానం చెప్పకపోయినా.. ఆ ప్రశ్నలను ఖండించలేదు. పైగా సంతోషంగానే ఉన్నట్లుగా నవ్వుతూ వెళ్లిపోయారు. దాంతో.. ఆమె వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సెంటిమెంట్‌ను వాడుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. అయితే.. షర్మిల తన రాజన్న సంక్షేమ పాలనను తెలంగాణలో తీసుకొస్తానంటూ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అంతేకాక.. ఆమె తండ్రి తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టారు. కొన్ని వేల కిలోమీటర్లు కూడా నడిచారు. కాగా.. పాదయాత్రలో షర్మిల అనుకున్నంత మద్దతు దొరకలేదు. దాంతో.. వైఎస్‌ఆర్‌ను ఆదరించిన కాంగ్రెస్‌ పార్టీలో చేరితే బాగుంటుందనే షర్మిల భావించినట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఆ పార్టీ నాయకులు కొందరు షర్మిలను కలిశారు. పార్టీలో చేరాలని కోరారు. దాంతో.. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే ఢిల్లీలో పర్యటించిన షర్మిల బిజీబిజీగా గడిపారు. ఆగస్టు 11న తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులోనే షర్మిలను పదేపదే పార్టీ విలీనం గురించి అడిగారు. దానికి షర్మిల సమాధానం చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా షర్మిల నవ్వుతూనే ఉండిపోయారు. పైగా ఆ ప్రశ్నలను ఖండించలేదు. సంతోషంగా ఉన్నట్లుగా నవ్వుతూనే ఉన్నారు. ఓపికగా ఉండాలని..ఓపికగా ఉండాలి.. చూద్దాం అని మాత్రమే అన్నారు. షర్మిల పార్టీ విలీనం ప్రశ్నలు ఖండిచకపోవడం.. నవ్వుతూ ఉండటంతో కాంగ్రెస్‌లో చేరుతుందనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లు అయ్యింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

షర్మిలతో పాటే విమానంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా అనే ప్రశ్నకు.. ఆయన కూడా స్పందించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి.. కాబట్టి ఆయన కూతరు పార్టీలోకి వస్తానని చెబితే కచ్చితంగా స్వాగతిస్తామని అన్నారు. అయితే.. తాను.. చెల్లమ్మ షర్మిల ఒకే విమానంలో వచ్చామని.. తనతో రాజకీయాల గురించి ఏవీ మాట్లాడలేని వెంకట్‌రెడ్డి చెప్పారు. కాకపోతే.. కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనరం సంగతి షర్మిలను అడిగతే బాగుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ఢిల్లీ పర్యటనలో రాహుల్‌గాంధీతో పాట ఖర్గేతో కూడా షర్మిల భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ విలీనంపై పూర్తిస్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సోనియా సమక్షంలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధం అయ్యారని టాక్ నడుస్తోంది. మరి అధికారికంగా ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.

Next Story