సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారు: వైఎస్ షర్మిల

రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌్కు వివేకా అలాంటి వారు అని షర్మిల చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  12 April 2024 9:15 AM GMT
ys sharmila, comments,  cm jagan, andhra pradesh,

సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారు: వైఎస్ షర్మిల

ఏపీలో అసెంబ్లీ,ఈ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గెలుపే లక్ష్యంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌్కు వివేకా అలాంటి వారు అని షర్మిల చెప్పారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా తాను కూడా మీ ఇంటి బిడ్డనే అన్నారు షర్మిల. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారని చెప్పారు. ఆయన గొడ్డలి పోట్లకు బలి అయ్యి ఐదేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ నేరస్థులను పట్టుకోకపోవడం దారుణమని అన్నారు. హత్య చేసినవారికి, చేయించినవారికి ఎందుకు శిక్ష పడటం లేదో ఆలోచన చేయాలని వైఎస్ షర్మిల అన్నారు. వివేకాను హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆమె అన్నారు. సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో దర్యాప్తు జరిపి.. అవినాశ్‌రెడ్డి హంతకుడిగా చెబుతోందని అన్నారు. డబ్బు లావాదేవీలు సహా అన్ని సాక్ష్యాలను కూడా సీబీఐ బయట పెట్టిందిన వైఎస్ షర్మిల గుర్తు చేశారు.

సీఎం జగన్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుతున్నారంటూ షర్మిల మండిపడ్డారు. సొంత చిన్నాన్న కుటుంబానికే సీఎం జగన్ న్యాయం చేయలేకపోతున్నారు .. ఇక సామాన్య ప్రజలకు న్యాయాన్ని ఎలా అందిస్తారని అన్నారు. ప్రజలు నమ్మి జగన్‌ కు అధికారం ఇస్తే.. హంతకులను కాపాడుతారా అని నిలదీశారు. ఇప్పటి వరకు అవినాశ్‌ను ఒక్కసారి కూడా జైలుకు వెళ్లకుండా చూశారని అన్నారు. అంతేకాక.. హత్యకేసులో నిందితుడిగా పేర్కొంటున్నా కూడా అవినాశ్‌రెడ్డికే టికెట్ ఇస్తారా అంటూ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల మండిపడ్డారు. తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననీ.. ఇక వైపు న్యాయం.. మరోవైపు అధికారం ఉన్నాయని చెప్పారు. ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారో ప్రజలే నిర్ణయించాలని అన్నారు.

Next Story