చంద్రబాబు ఇల్లు మొదట కూలగొట్టడమే సముచితం: విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2024 2:45 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర విమర్శలను గుప్పించారు. సీఎం చంద్రబాబు అబద్దాలకు కేరాఫ్ అన్నారు. అబద్దాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు అనీ.. ఆయన పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరమే లేదన్నారు. సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనబడదన్నది నానుడి అని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. పాలకులకు ఒక న్యాయం పౌరులకు మరోక న్యాయం ఉండదనీ.. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. పర్యావరణాన్ని దెబ్బతీసేలా మొదటగా ఇల్లు నిర్మించుకున్నది సీఎం చంద్రబాబే అని విమర్శలు చేశారు. సున్నితమైన కృష్ణా నది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో చంద్రబాబు నివసిస్తున్నప్పుడు.. బుడమేరు రివలెట్‌పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం ఆయనకు ఎక్కడుందని ప్రశ్నించారు.
చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితమని అన్నారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు అక్రమ నివాసాన్ని ముందుగా కూల్చాల్సిందే అని చెప్పారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మరో ట్వీట్ ద్వారా విజయసాయిరెడ్డి ఇలా రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికీ ప్రతిపక్షం మాదిరే వ్యవహరిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి పాలకపక్షంగా బాధ్యతలను నిర్వర్తించాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హితవు పలికారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌పై ప్రభుత్వానికి ఆలోచనే లేదని విమర్శించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాత్రమే పనిగా పెట్టుకోవడం సరికాదని చెప్పారు. అధికార పక్షం ఇకనైనా మేల్కొని.. రాష్ట్ర ప్రజల బాగు కోసం ముందుకు వెళ్లాలని ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.
అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి శ్రీ చంద్రబాబు నాయుడు @ncbn . ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు! సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 17, 2024
సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన… pic.twitter.com/SkOq4EnmZd