ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 117 స్థానాలకు గానూ 92 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కాకుండా తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఇటీవలే ప్రమాణ స్వీకారం చేయగా.. శనివారం 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వారందరూ పంజాబీలో ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. రెండు సార్లు దీర్బా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హర్పాల్ సింగ్ చీమా, మాలౌత్ నుంచి గెలుపొందిన బల్జీత్ కౌర్, జాందియాల ఎమ్మెల్యే హర్భజన్ సింగ్ ఈతో, మాన్సా ఎమ్మెల్యే విజయ్ సింగ్లా, భోవా ఎమ్మెల్యే లాల్ చంద్ కటారుచక్, బార్నాలా ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ మీత్ హాయర్, అజ్నాలా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ధలివాల్, పాటి ఎమ్మెల్యే లాల్ జిత్ సింగ్ భుల్లార్, హోషియార్ పూర్ ఎమ్మెల్యే బ్రహ్మ శంకర్ జింపా, ఆనంద్ పూర్ సాహిబ్ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బెయిన్స్ లు ఉన్నారు.