నేడు కొత్తగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 April 2024 8:14 AM IST
telangana, lok sabha, election, jp nadda,

నేడు కొత్తగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం నిర్విస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రచార సభలు, ర్యాలీలు.. యాత్రలు చేపడుతున్నారు. అయితే.. ఇవాళ తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు.

కొత్తగూడెంలో సోమవారం బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు అవుతారు. ఈ సభ నుంచి ప్రసంగించనున్నారు. ఈ సభలో జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా పాల్గొంటారు. ముందుగా విజయవాడ నుంచి జేపీ నడ్డా హెలిక్టాప్టర్‌లో బయల్దేరి కొత్తగూడెం వస్తారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా. ఈ బీజేపీ బహిరంగ సభ ఉదయం 11.40 గంటలకు ప్రారంభం అయ్యి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ సభ ముగిసిన తర్వాత జేపీ నడ్డా కొత్తగూడెం నుంచి బయల్దేరి మహబూబాబాద్‌కు వెళ్లనున్నారు.

Next Story