జీహెచ్‌ఎంసీలో చతికిలపడిపోయిన 'టీడీపీ'
TDP situation in GHMC .. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి కోలుకోలేదని దెబ్బ తగిలింది. 150 స్థానాలున్న జీహెచ్‌ఎంసీలో తెలు
By సుభాష్ Published on 5 Dec 2020 5:19 AM GMTజీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి కోలుకోలేదని దెబ్బ తగిలింది. 150 స్థానాలున్న జీహెచ్‌ఎంసీలో తెలుగుదేశం పార్టీ 106 స్థానాల్లో పోటీ చేసింది. కనీసం ఒక్క సీటైనా గెలువకుండా బొక్కబోర్ల పడిపోయింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైన టీడీపీకి చతికిలా పడిపోయింది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 90 శాతం టికెట్లు బడుగు, బలహీనవర్గాలకే ఇచ్చినట్లు పార్టీ ప్రచారం చేసుకుంది. ఆటో డ్రైవర్ సతీమణికి ఓ డివిజన్‌లో, పాలు అమ్ముకునే సాధారణ వ్యక్తికి మరో చోట ఇలా పార్టీ కోసం పని చేసిన సామాన్య కార్యకర్తలకే సీట్లు కేటాయించింది టీడీపీ. ఇక నిన్న వెలువడిన ఫలితాలు సైకిల్ పార్టీకి తీవ్ర నిరాశ కలిగించాయి. కేంద్ర , రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు పంచారని, తాము ఓటర్లను లొంగదీసుకోకుండా డబ్బులు పంచకుండా నిజాయితీగా ప్రచారం చేశామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.
కాగా, 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరుగగా, మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ అవతరించింది. అనంతరం 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీడీపీ మొత్తం 150 డివిజన్లకు గాను 45 స్థానాలు దక్కించుకుంది. కానీ ఎక్కువ స్థానాలు సాధించిన కాంగ్రెస్, ఎఐఎంలు కలిసి చెరో రెండున్నర ఏళ్లు మేయర్ పదవి పంచుకున్నాయి. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 15 స్థానాలు గెలుపొందగా, అందులో అత్యధికంగా సీట్లు గ్రేటర్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ బలహీన పడుతూ వచ్చింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్కసాటు కూడా దక్కకుండా పోయింది.