వచ్చే ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో.. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 1:52 PM ISTవచ్చే ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో.. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఇప్పటికే ఆయా పార్టీల అధిష్టానాలను క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల మినహా దాదాపు అభ్యర్థులను ఎవరిని నిలబెట్టాలనే దానిపై ఆలోచనలు చేశాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో పోటీపై టీడీపీ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అయితే.. చీపురుపల్లి నుంచి పోటీ చేసే అంశంపై తాను కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. చీపురుపల్లి తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందనీ.. దీనికి తోడు అది వేరే జిల్లా కాబట్టి ఆలోచనలో పడ్డానన్నారు. వారం రోజుల్లో టీడీపీ ఎన్నికల కోసం లిస్ట్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు విశాఖ నుంచి పోటీ చేయానలి ఉందని మనసులో మాటను బయటపెట్టారు గంటా. ఈ విషయంపై తాను కూడా మరోసారి ఆలోచన చేసుకుని నిర్ణయాన్ని అధిష్టానానికి చెబుతానని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని గంటా చెప్పారు. సిద్ధం సభలకు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక అసెంబ్లీ చివరి సెషన్‌లో సభ్యులంతా ఫొటో దిగడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అలాంటి ఆనవాయితీని కూడా పక్కనపెట్టారని.. సీటు రానప్పుడు పార్టీ మారడం పెద్ద విషయం కాదని చెప్పారు. కేశినేని నానికి సీటు ఇవ్వలేము అని చెప్తేనే ఆయన పార్టీ వీడి వైసీపీలో చేరారని.. వైసీపీకి ఎంతో సహకరించిన వేమిడిరెడ్డి కూడా పార్టీని వీడారని గంటా శ్రీనివాసరావు అన్నారు.