బ్రేకింగ్‌: రజనీకాంత్‌ కొత్త పార్టీ ప్రకటన.. ముహూర్తం ఖరారు

Rajinikanth new political party .. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎట్టకేలకు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. 2021 ఎన్నికల్లో బరిలో

By సుభాష్  Published on  3 Dec 2020 7:15 AM GMT
బ్రేకింగ్‌: రజనీకాంత్‌ కొత్త పార్టీ ప్రకటన.. ముహూర్తం ఖరారు

తమిళనాడు: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులకు కొత్త సంవత్సరం గిఫ్ట్ ప్రకటించారు. రజనీకాంత్‌ ఎట్టకేలకు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. 2021 ఎన్నికల్లో బరిలో దిగబోతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అయితే డిసెంబర్‌ 31న పార్టీకి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఈ పార్టీని జనవరిలో పెట్టబోతున్నట్లు రజనీ ప్రకటించారు. రజనీ పార్టీ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు తదుపరి సీఎం రజనీకాంత్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

2021 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని రజనీ పేర్కొన్నారు. ఇటీవలే అభిమాన సంఘాలతో సమావేశమైన రజనీకాంత్‌.. కొత్త పార్టీ ప్రకటించడంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో అభిమానులు సంబరాలు జరుపుకొంటున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ప్రచారానికి రజనీ తెరదించారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. సూపర్‌ స్టార్‌ ప్రకటనతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

Next Story