కాంగ్రెస్‌కు కంచుకోట వయనాడ్‌.. బరిలోకి ప్రియాంక గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలను చూసింది.

By Srikanth Gundamalla  Published on  18 Jun 2024 7:07 AM IST
rahul gandhi, resign, wayanad, priyanka gandhi,

కాంగ్రెస్‌కు కంచుకోట వయనాడ్‌.. బరిలోకి ప్రియాంక గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలను చూసింది. 99 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. గత స్థానాలతో పోలిస్తే పెరిగాయి. కాగా..ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసి.. రెండింటా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వయనాడ్ తో పాటు రాయ్‌బరేలిలో రాహుల్‌ గెలిచారు. ఈ క్రమంలోనే ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండగా.. వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేస్తారని కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జునఖర్గే ప్రకటించారు. అంతేకాదు.. ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

వయనాడ్ ప్రజలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని రాహుల్ గాంధీ అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు తనని ఎంతో ఆదరించారని చెప్పారు. ప్రియాంకతో పాటు తాను వయనాడ్‌కి వెళ్తూ ఉంటానని చెప్పారు. వయనాడ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తానని రాహుల్‌ అన్నారు. గత ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి ప్రియాంక పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె బరిలో నిలబడలేదు. రాహుల్‌ పేరును రెండు స్తానాల్లో ప్రకటించింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ సీటులో ముందు వరకు సోనియా ఎంపీగా కొనసాగారు. 1951 నుంచి వయనాడ్ స్థానంలో కేవలం మూడుసార్లు మాత్రమే హస్తం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వయనాడ్ నుంచి మూడుసార్లు గెలిచారు. అంతకుముందు ఫిరోజ్‌ గాంధీ రెండుసార్లు గెలిచారు. 1962, 1999 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయలేదు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ రాయ్‌బరేలీ నుంచి ఫిరోజ్‌ గాంధీ ఎంపీగా నెగ్గారు. దాదాపు పదేళ్ల గ్యాప్‌ తర్వాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా రెండు సార్లు గెలిచారు. 1977లో మాత్రం జనతా పార్టీ అభ్యర్థి రాజ్‌ నారాయణ్ గెలిచారు. మళ్లీ 1980లో ఇందిరాగాందీ మళ్లీ గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్‌ గెలిచింది. 1996-98 టైంలో బీజేపీ నేత అశోక్‌ సింగ్‌ ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి సతీశ్‌ శర్మ గెలిచారు. 2004 నుంచి వరుసగా ఐదుసార్లు.. 2006 ఉపఎన్నికతో సహా సోనియాగాంధీనే గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో కూడా రాహుల్‌గాంధీ ఇక్కడ ఘనవిజయం సాధించారు. మరి కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న వయనాడ్‌లో ప్రియాంకనే గెలుస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story