'బ్రో' సినిమాలో పేరడీ సీన్‌పై రాజకీయ దుమారం

'బ్రో' సినిమాలో కనిపించిన ఓ సీన్‌ ఏపీ రాజకీయాలను టచ్‌ చేసింది. తీవ్ర దుమారం రేపుతోంది.

By Srikanth Gundamalla  Published on  29 July 2023 6:39 AM GMT
Pawan Kalyan, Bro Movie, Minister Ambati, Politics,

'బ్రో' సినిమాలో పేరడీ సీన్‌పై రాజకీయ దుమారం

బ్రో సినిమా ఓ పేరడీ సీన్ రాజకీయ దుమారం రేపుతోంది. పవన్‌ కళ్యాణ్, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన బ్రో సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది. ప్రేక్షకులు సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. పవర్‌ స్టార్‌ వన్‌ మ్యాన్‌ షో అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అంతా బాగానే ఉన్న ఈ సినిమాలో కనిపించిన ఓ సీన్‌ ఏపీ రాజకీయాలను టచ్‌ చేసింది. దాంతో.. వైసీపీ, జనసేన మధ్య వివాదాలను మరోస్థాయికి చేరుస్తోంది.

ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. రోడ్లపై హుషారుగా మహిళలతో కలిసి చిందులేశారు. అప్పట్లో ఈ వీడియో కూడా తెగ వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబు వేసిన స్టెప్పులనే బ్రో సినిమాలో పెట్టారు. అంబటిని టార్గెట్‌ చేసుకునే కొన్ని డైలాగ్‌లు, డ్యాన్సులు హాస్య నటుడు పృథ్విరాజ్‌తో చెప్పించారు. దాంతో.. జనసేన నాయకులు, కార్యకర్తలు అది అంబటి రాంబాబే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ర్యాగింగ్ మామూలుగా లేదని జనసేన ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఇక వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా కౌంటర్లు వేస్తున్నారు. డైరెక్ట్‌గా ఏమీ చేయలేకే సినిమాల్లో డైలాగులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. బ్రో సినిమాలో పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్‌ అచ్చం మంత్రి అంబటినే పోలి ఉంది. అంతేకాక అప్పుడు అంబటి రాంబాబు వేసిన స్టెప్పులనే రిపీట్‌ చేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. గెలిచినోడి డాన్స్‌ సంక్రాంతి! ఓడినోడి డాన్స్ కాళరాత్రి! అంటూ నేరుగా పవన్‌ కళ్యాణ్‌నే ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈ సినిమాలోనే గతంలోనూ పవన్ కళ్యాణ్‌ రాజకీయ నాయకులను విమర్శించేలా పలు సీన్లు ఉన్నాయంటున్నారు వైసీపీ నాయకులు. తమను డైరెక్ట్‌గా ఏం చేయలేకే ఇలాంటి సీన్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జనసేన నాయకులు కూడా వైసీపీ నేతల కౌంటర్లకు సమాధానాలు ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే రచ్చ నడుస్తోంది. బ్రో సినిమాలో కనిపించిన ఒక్క పేరడీ సీన్‌ రాజకీయ దుమారానికి దారి తీసింది. మున్ముందు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Next Story