నారా లోకేష్ పాద‌యాత్ర పేరు ఖ‌రారు.. 'యువ‌గ‌ళం' పేరిట ప్ర‌జ‌ల్లోకి

Nara Lokesh padayatra name Yuva Galam.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా లోకేష్ పాద‌యాత్రకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Dec 2022 12:09 PM IST
నారా లోకేష్ పాద‌యాత్ర పేరు ఖ‌రారు.. యువ‌గ‌ళం పేరిట ప్ర‌జ‌ల్లోకి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్రకు సిద్ద‌మ‌య్యారు. జ‌న‌వ‌రి 27 నుంచి పాద‌యాత్ర ప్రారంభం కానుంది. ఈ పాద యాత్ర‌కు "యువ గ‌ళం" అని పేరు పెట్టారు. కుప్పం నుంచి ప్రారంభం కానున్న ఈ పాద‌యాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీట‌ర్ల మేర, 100 నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా కొన‌సాగ‌నుంది.

పాద‌యాత్ర‌కు సంబంధించి లోగో, పేరును ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ శ్రేణులు అమ‌రావ‌తిలోని పార్టీ కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీగా ఉండేలా పాద‌యాత్ర‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. యువ‌త‌తో పాటు మ‌హిళ‌లు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ముందుకు సాగుతార‌న్నారు. ఈ పాద‌యాత్ర‌లో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు.

ఇక ఈ పాద‌యాత్ర‌లో అంద‌రూ ఇంట‌రాక్ట్ అయ్యేలా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాన్ని టీడీపీ క‌ల్పించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ దృష్టిని యువ‌త స‌మ‌స్య‌ల‌పై మ‌ళ్లించేందుకు యువ‌త ఆధారిత ఎజెండాని రూపొందించే ప్ర‌తిపాద‌న‌కు అవ‌కాశం ఉంది. ప్ర‌తి ఒక్క‌రు 96862 96862కు మిస్ట్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా https://yuvagalam.com/ ద్వారా పాల్గొనవచ్చు. కొత్త సంవ‌త్స‌రంలో తెలుగు యువ‌త మ‌న ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉరుకోబోదు. అభివృద్ది లేని, బాధ‌త‌ల‌తో నిండిన స్థితిలోకి జారుకున్న రాష్ట్రంలోకి యువ‌త ముంద‌డుగు వేయ‌బోదు. మార్పు ఈ సంవ‌త్స‌రం తీర్మానంగా మారుద్దాం. లోకేష్‌తో క‌లిసి న‌డుద్దాం.. మెరుగైన ఆంధ్రప్ర‌దేశ్ కోసం న‌డుద్దాం అని అంటోంది టీడీపీ.

Next Story