అసెంబ్లీ ఘటనపై నారా భువనేశ్వరి బహిరంగ లేఖ.. 'నాకు జరిగింది మరెవరికీ జరగకూడదు'
Nara Bhuvaneswari reacts to AP Assembly incident.ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై
By తోట వంశీ కుమార్ Published on
26 Nov 2021 8:11 AM GMT

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరీ స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వరీ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
'ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మ గారు, నాన్న గారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను' అని భువనేశ్వరి బహిరంగ లేఖలో తెలిపారు.
Next Story