బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రాములు

బీఆర్ఎస్‌ పార్టీని వీడిన నాగర్‌కర్నూల్ ఎంపీ బీజేపీ కండువా కప్పుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  29 Feb 2024 11:53 AM GMT
nagarkurnool, MP ramulu,  bjp, telangana politics ,

 బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రాములు 

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నిలకు సమయాత్తం అవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు తాజాగా మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్‌ పార్టీని వీడిన నాగర్‌కర్నూల్ ఎంపీ బీజేపీ కండువా కప్పుకున్నారు.

గురువారం నాగర్‌కర్నూలు ఎంపీ ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సహా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థిని తానే అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుటున్నారీ... దాంతో రాములు బీఆర్ఎస్‌ను వీడినట్లు తెలుస్తోంది. రాములు బీజేపీలో చేరడాన్ని ఎంపీ లక్ష్మణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ శక్తివంతంగా మారుతోందని చెప్పారు.

తెలంగాణలో ఇన్నాళ్లు తమకు ఎదురు లేదనుకున్న బీఆర్ఎస్‌కు.. ప్రజలే షాక్‌ ఇచ్చారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్‌ మునిగిపోయిన నావ.. కారు రిపేర్‌ అయ్యి షెడ్‌కు వెళ్లిందని విమర్శించారు. ఇక రిపేర్‌ అయిన కారు బయటకు వచ్చే పరిస్థితులు లేవన్నారు. అయితే.. ఈ మార్పులు కాంగ్రెస్‌ మాత్రం లాభపడిందని లక్ష్మణ్ అన్నారు. కానీ.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారిపోతుందని చెప్పారు. బీజేపీ అన్ని చోట్ల బలపడుతోందని అన్నారు.అన్ని పార్టీల నుంచి రాజకీయ నాయకులు బీజేపీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని చెప్పారు. తెలంగాణలో అధిక స్థానాలను బీజేపీ గెలవబోతుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ దీమా వ్యక్తం చేశారు.


Next Story