స‌మాజ్‌వాదీ పార్టీకి షాక్‌.. బీజేపీలో చేరిన ములాయం సింగ్ కోడలు అపర్ణ యాదవ్

Mulayam Singh Yadav's daughter in law Aparna Yadav joins BJP.సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ కోడలు

By M.S.R  Published on  19 Jan 2022 6:27 AM GMT
స‌మాజ్‌వాదీ పార్టీకి షాక్‌.. బీజేపీలో చేరిన ములాయం సింగ్ కోడలు అపర్ణ యాదవ్

సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ కోడలు అపర్ణ యాదవ్‌ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. బిహార్‌ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఆమెకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. అఖిలేష్ యాదవ్ సోదరుడిని వివాహం చేసుకున్న అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. అపర్ణా యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ భార్య. బీజేపీ కండువా కప్పుకున్న అపర్ణా యాదవ్ మాట్లాడుతూ.. ''తాను ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటానని. ఇప్పుడు దేశానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. బీజేపీ పథకాలకు చాలా ఆకర్షితురాలినని తెలిపారు. తనకు దేశం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందన్న అపర్ణ.. మోదీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

అపర్ణ లక్నో కాంట్‌ అసెంబ్లీ స్థానం టికెట్‌ ఆశిస్తున్నారు. 2017లో అదే స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కొడుకైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్ బీజేపీలో చేరడం యూపీ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని చెబుతున్నారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్ సమక్షంలో అపర్ణ బీజేపీలో చేరారు. మౌర్య, స్వతంత్రదేశ్ ఆమెకు సభ్యత్వమిచ్చి, కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Next Story