కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన కామెంట్స్

ఎమ్మెల్సీ కడియం శ్రీహారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజయ్య.

By Srikanth Gundamalla  Published on  8 July 2023 6:23 AM GMT
MLA Rajaiah,  MLC kadiyam Srihari, BRS,

కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన కామెంట్స్

జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘనపూర్ మండలం తాటికొండలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజయ్య. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైనా సరే స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే నియోజకవర్గంలోకి రావాలి. కానీ.. కడియం శ్రీహరి ఇప్పటి వరకు ఎమ్మెల్యేకు చెప్పకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యే రాజయ్య కోరారు.

కడియం దేవాదుల సృష్టికర్త కాదు..ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అని ఆరోపించారు. తెలంగాణలో ఎక్కడా జరగనన్ని ఎన్‌కౌంటర్లు స్టేషన్‌ఘన్‌పూర్‌లోనే జరిగాయని అన్నారు. మాదిగబిడ్డలు ఎక్కువ మంది ఎన్‌కౌంటర్‌కు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం ఉళ్లలోకి వస్తే వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో మంత్రిగా ఉన్నప్పుడే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్‌కౌంటర్లు జరిగాయన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దమ్ముంటే తన లాగా గ్రామాల్లో తిరిగాలని సవాల్‌ విసిరారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి ఏనాడూ దళితవాడల్లో బస చేయలేనది విమర్శించారు. మంత్రి కావాలంటే ఎమ్మెల్సీ సరిపోతుంది.. కానీ ఎమ్మెల్యే ఎందుకు అని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి మంత్రిగా పని చేసినప్పుడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనకు ఆయన నీతిమంతుడిని అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంపై కరుణ చూపేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తనకు ఎప్పుడూ అండగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. కొందరు తన వీడియోలు, ఆడియోలు ఉన్నాయని కుట్ర చేస్తున్నారని.. వారిని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

Next Story