మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్
MLA Quota MLC Election Schedule Released Today.తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా
By తోట వంశీ కుమార్ Published on
31 Oct 2021 6:00 AM GMT

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక కోసం నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16న నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నవంబర్ 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
నవంబర్ 29న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణలో జూన్ 3న ఆరుగురు ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత, నేతి విద్యాసాగర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకట్వేశర్లు, కడియం శ్రీహరి.. ఏపీలో ఈ ఏడాది మే 31న ముగ్గురు ఎమ్మెల్సీలు చినగోవిందరెడ్డి, మహ్మద్ షరీప్, సోము వీర్రాజు ల పదవికాలం ముగిసింది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసిన ఈసీ.. తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Next Story