ఉపఎన్నిక వచ్చినా సిద్ధమే: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2024 10:55 AM GMT
ఉపఎన్నిక వచ్చినా సిద్ధమే: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక కామెంట్స్ చేశారు. స్టేషన్‌ఘనపూర్‌కు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టంగా చెప్పారు. గురువారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్‌దని కడియం శ్రీహరి గు్తు చేశారు. ఇప్పట్లో ఉప ఎన్నిక రావని... వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే... బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కోర్టులపై, ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందని కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఆరు ముక్కలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇన్నాళ్లు కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం బంధీగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో ఉపఎన్నికలు రాబోతున్నాయంటూ ఏవేవో మాట్లాడుతున్నారని కడియం అన్నారు. కానీ.. అది జరిగే పని కాదన్నారు.

కీలక అసెంబ్లీ స్టేషన్‌ఘనపూర్‌కు త్వరలో ఉపఎన్నిక వస్తుందని కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి స్టేషన్ ఘనపూర్‌లో తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి పోటీచేసి విజయం సాధించారు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల సమయానికి కడియం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కడియంతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Next Story