కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధం.. నాగ‌బాబుకు రోజా గ‌ట్టి కౌంట‌ర్‌

Minister RK Roja strong counter to Janasena Leader Nagababu.నాగ‌బాబు, మంత్రి రోజాల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2023 10:09 AM IST
కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధం.. నాగ‌బాబుకు రోజా గ‌ట్టి కౌంట‌ర్‌

సినీ న‌టుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజాల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. ఇటీవ‌ల మెగా ఫ్యామిలీపై రోజా విమ‌ర్శ‌లు చేయ‌గా ఆ వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు ఘాటుగా స్పందించారు. ఆమె నోటికి, మున్సిపాలిటి కుప్ప‌తొట్టికి పెద్ద తేడా లేదంటూ విరుచుకుప‌డ్డాడు. కాగా.. నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై మంత్రి రోజా గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది.

విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చెయ్యాలి లేదా మూసుకోవాలి. నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు. ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చెయ్యటం మీకే చెల్లుతుంది. ఏపి గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు. నా శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అంటూ నాగ‌బాబు ట్యాగ్ చేస్తూ మంత్రి రోజా ట్వీట్ చేశారు. నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. తాను ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న త‌రువాత ఏపీ టూరిజం దేశంలో మూడో స్థానంలో నిలిచింద‌ని రోజా చెప్పారు. ఈ విష‌యం తెలియ‌కుండా మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

నాగ‌బాబు ఏమ‌న్నారంటే..

"రోజా... భార‌త‌దేశ ప‌ర్యాట‌క శాఖ ర్యాంక్సింగ్‌లో ఉన్న 20 స్థానాల్లో కేర‌ళ‌, అసోం, గుజ‌రాత్ వంటి రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 18వ స్థానంలో ఉంది. ఇంకా కిందకెళ్తే చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతలను మర్చిపోయి నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. అతి త్వ‌ర‌లో అంటే నువ్వు ప‌దవి దిగిపోయేలోగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని 20వ స్థానానికి తీసుకుపోయే అవకాశం ఉంది. ఏపీ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నీవు ఇలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు ఏమిటో తెలుసుకో. పర్యాటక శాఖ మంత్రి అంటే నీవు పర్యటనలు చేయడం కాదు. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో. నీవు ఇన్ని రోజులు చిరంజీవిని, పవన్ కల్యాణ్ ని నోటి కొచ్చినట్టు మాట్లాడినా ఆఫ్ కోర్స్ నా గురించి కూడా మాట్లాడినా నేను లెక్క చేయను. మా పార్టీ అధినేత పవన్ ని, అన్నయ్య చిరంజీవిని నోటికొచ్చినట్టు మాట్లాడినా నేను ఎందుకు రియాక్ట్ కాలేదంటే దానికి ఒకే ఒక కారణం ఉంది. నీ నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తూచూస్తూ ఎవడూ మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకడు. అదీ రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో" అంటూ రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story