కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర కామెంట్స్

షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  4 Jan 2024 9:02 AM GMT
minister peddi reddy, comments,  sharmila,  congress,

కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర కామెంట్స్ 

తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీని స్థాపించి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని చెప్పిన వైఎస్ షర్మిల ఇవాళ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఏంటనే చర్చ కొనసాగుతోంఈ నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో ఏపీలో రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల పనిచేస్తే పరిస్థితి ది. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరినంత మాత్రాన తాము పార్టీ మారి మా కాళ్లు తామే నరుక్కుంటామా అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్‌లపై ఆయన విమర్శలు చేశారు. కుటుంబాల్లో చిచ్చుపెట్టడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని అన్నారు. టీడీపీ అధినేత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతా అని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు సీఎం జగన్‌కు మద్దతుగా ఉన్నారనీ.. ఆయన్నీ మరోసారి సీఎం చేయడం పక్కా అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. తాము సీఎం జగన్‌తోనే కలిసి నడుస్తామని చెప్పారు. ఇతర పార్టీల్లో ఎవరు చేరినా కానీ వారిని ప్రత్యర్థులుగానే చూస్తామన్నారు. జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని తాము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఎవరో రెచ్చగొడితే మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఇప్పటికైనా పునరాలోచన చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.

Next Story