బీఆర్ఎస్ విలీనం అనేది తప్పుడు ప్రచారం: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై కేటీఆర్ స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2024 7:30 AM IST
ktr, comments,  brs party,  Telangana politics ,

 బీఆర్ఎస్ విలీనం అనేది తప్పుడు ప్రచారం: కేటీఆర్ 

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఒక అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

బీఆర్ఎస్ ఇతర పార్టీలో విలీనం అవుతుందనే వార్తలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పొత్తులు పెట్టుకుంటుందని సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విలీనం అవుతుందన్న ప్రారాన్ని బుధవారం ఒక ప్రకటనలో కేటీఆర్ ఖండించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. 24 ఏళ్ల పాటు ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని బీఆర్ఎస్‌ ఈ స్థాయి వరకు వచ్చిందని అన్నారు. అవిశ్రాంతంగా పోడాడి తెలంగాణ సాధించిన పార్టీపై ఇలాంటి విమర్శలు ఏమాత్రం తగవని అన్నారు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపిందని అన్నారు. ఎప్పటి మాదిరిగానే బీఆర్ఎస్‌ ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ చెప్పారు.ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలంటూ హితవు పలికారు.


Next Story