దేశవ్యాప్త పర్యటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం.. నేడు ఢిల్లీకి
KCR Plunges into National Politics Embarks on Country wide Yatra.ఊహాగానాలకు తెరదించుతూ, సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం
By తోట వంశీ కుమార్ Published on 20 May 2022 9:46 AM ISTఊహాగానాలకు తెరదించుతూ, సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం కె చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశవ్యాప్తంగా యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. దేశ రాజధానిలో ఆయన వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు..
- నేడు(శుక్రవారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. జర్నలిస్టులు, ప్రముఖ జాతీయ మీడియా సంస్థల ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు.
- మే 22న కేసీఆర్ చండీగఢ్‌లో పర్యటించనున్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది రైతుల కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌తో కలిసి కేసీఆర్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులను అందజేయనున్నారు.
- మే 26న బెంగళూరులో పర్యటించనున్నారు. భారత మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవనున్నారు.
- మే 27న ఆయన రాలేగావ్ సిద్ది వెళ్లి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేను కలవనున్నారు. అనంతరం షిర్డీ సాయిబాబాను దర్శించుకోనున్నారు. తరువాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
- మే 29, 30 తేదీల్లో కేసీఆర్ బెంగాల్, బీహార్‌లో పర్యటించనున్నారు. గాల్వాన్ లోయలో అమరులైన భారత జవాన్ల కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం ఆదుకోనున్నారు.